Athletics Championship | లిమా: లిమా(పెరూ) వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10,000మీటర్ల రేస్‌వాక్‌లో ఆర్తి కాంస్య పతకంతో మెరిసింది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో ఆర్తి 44 నిమిషాల 39.39 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 17 ఏండ్ల ఆర్తి జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల హైజంప్‌లో పూజసింగ్ ఫైనల్లోకి ప్రవేశించింది.