Ashes Series : యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన బెన్ స్టోక్స్ (Ben Stokes) సేన సిరీస్‌లో బోణీ కొట్టాలనుకున్న వేళ మరో షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) అనూహ్యంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా గబ్బా టెస్టులో ఆడని వుడ్.. మిగతా మూడు టెస్టులకూ అందుబాటులో ఉండడం లేదు. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సైతం పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) సేవల్ని కోల్పోనుంది.
స్వదేశంలో భారత్‌తో సిరీస్ పంచుకున్న ఇంగ్లండ్ యాషెస్‌లో చెలరేగానులకుంది. బ్యాటర్లు, బౌలర్ల వైఫల్యంతో తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలు చవిచూసింది. అడిలైడ్లోనైనా విజయంతో సిరీస్‌లో నిలవాలనుకున్న ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ సేవల్ని కోల్పోనుంది. ఏడాది కాలంగా గాయాలతో సతమతమవుతున్న వుడ్ మోకాలి గాయం తిరగబెట్టడంతో యాషెస్ సిరీస్ నుంచి నిష్క్రమించాడు. త్వరలోనే ఈ స్పీడ్‌స్టర్ స్వదేశంలో రిహాబిలిటేషన్ సెంటర్లో చేరనున్నాడు. అక్కడ.. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వైద్యులు అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. పెర్త్ టెస్టులో 11 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు వుడ్.
Wood had surgery on his left knee after hobbling out of England’s Champions Trophy campaign in February. The series opener in Perth was his first Test match in 15 months.
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2025
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను వణికిస్త సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సైతం బిగ్ షాక్ తప్పలేదు. గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సిరీస్ నుంచి వైదొలిగాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో తొడకండరాల గాయంతో ఇబ్బందిపడిన హేజిల్‌వుడ్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అడిలైడ్ టెస్టులోపు ఫిట్‌గా ఉంటాడని ఆసీస్ టీమ్ అనుకుంది. కానీ.. అతడు కోలుకోలేకపోవడంతో.. సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం హేజిల్‌వుడ్ సిద్ధంగా ఉంటాడని కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
An Ashes series without Hazlewood 🤕
🔗 https://t.co/dUxOctBEvR pic.twitter.com/Hvz04SfrTN
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2025
గుడ్‌న్యూస్ ఏంటంటే.. ఫిట్నెస్ సాధించిన ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అడిలైడ్ టెస్టులో ఆడనున్నాడు. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ రాకతో రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్టీవ్ స్మిత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.