Ind-W Vs WI-W | ఐసీసీ మహిళా ప్రపంచకప్ (Women’s World Cup)లో భాగంగా భారత్ తన మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారతజట్టు మలి పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఈనేపథ్యంలో వెస్టిండీస్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన విండీస్ ఫుల్ జోష్‌లో ఉంటే.. వారికి సరైన బదులివ్వాలని మిథాలీ బృందం యోచిస్తున్నది. టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం.. టీమ్ఇండియాను కలవరపెడుతున్నది.