దుబాయ్: రోల్ బాల్ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో భారత జట్లు.. డిఫెండింగ్ చాంపియన్స్ కెన్యాను ఓడించి టైటిల్స్ కైవసం చేసుకున్నాయి. గురువారం హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో మహిళల జట్టు.. 3-2తో కెన్యాను చిత్తుచేసింది. భారత మహిళల జట్టుకు ఇది 7వ వరల్డ్‌కప్ కావడం విశేషం.

నిరుడు 3వ స్థానంతో నిలిచిన మన అమ్మాయిలు.. ఈసారి మాత్రం పట్టు విడవకుండా కప్పును ఒడిసి పట్టుకున్నారు. ఇక పురుషుల విభాగానికి వస్తే.. 11-10తో కెన్యాకు షాకిచ్చి ప్రపంచ విజేతలుగా నిలిచారు. వరల్డ్‌కప్ గెలుచుకోవడం మెన్స్ టీమ్‌కు ఇది ఐదోసారి. ఒక దశలో 3-8తో వెనుకబడ్డ భారత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. రోల్‌బాల్ అనేది బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, రోలర్ స్కేటింగ్‌తో కూడిన ఆట. ఆటగాళ్లు ‘రోలర్ షూస్’ ధరించి ఈ ఆట ఆడుతారు.