బ్రిస్టల్: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో టీ20 మయాచ్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి పోరులో ఓటమికి బదులు తీర్చుకొని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో లెక్క సమం చేసింది. తొలుత ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. ఫ్రేయా కెంప్ (39 నాటౌట్), డాని వ్యాట్ (29), అమీ జోన్స్ (28), అలీస్ కాప్సే (28) రాణించారు. శ్రీ చరణి 3 వికెట్లతో మెరిసింది. అనంతరం ఛేదనలో భారత్ ఓవర్లన్నీ ఆడి 142/9 స్కోరు చేసి ఓడింది. యాస్తికా భాటియా (33), మంధాన (32), షఫాలీ (22), కెప్టెన్ హర్మన్ (28) పోరాడినా ఫలితం లేకపోయింది. చార్లీ డీన్ (2/20), లారెన్ బెల్ (2/33) దెబ్బకొట్టారు. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.