Women’s T20 World Cup | ఢాకా: బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్, గ్రూఫ్ ఫిక్చర్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా బంగ్లాదేశ్‌లోని షేర్ ఎ బంగ్లా, సిల్హెట్ వేదికలుగా మ్యాచ్‌లు జరుగున్నాయి.
పది జట్లు తలపడనున్న ఈ మెగా టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 ఉండగా ఆతిథ్య బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, క్వాలిఫయర్ 2 గ్రూప్-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 4న కివీస్ మ్యాచ్‌తో ప్రపంచకప్ వేట ఆరంభించనున్న భారత్.. 6న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది.