Womens T20 WC : ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ సీవర్ బ్రంట్ ఔట్ అయింది. హాఫ్ సెంచరీ కొట్టిన అనంతరం ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. దీప్తి శర్మ ఓవర్లో సీవర్ ఇచ్చిన క్యాచ్‌ను మంధాన ఒడిసిపట్టుకుంది. దాంతో, 120 రన్స్ వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. సోఫీ ఎక్లెస్టోన్ క్రీజులోకి వచ్చింది. 17 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్… 120/5.
కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీ కొట్టింది. 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. సింగిల్ తీసి 50కి చేరువైంది. సీవర్, అమీ జోన్స్(26)తో కలిసి ఐదో వికెట్‌కు38 రన్స్ జోడించింది. 14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్.. 92/4. అంతకుముందు హీథర్ నైట్, సీవర్ బ్రంట్ జోడీ మూడో వికెట్‌కు 51 పరుగులు చేసింది. ప్రమాదకరమైన హీథర్ నైట్(28)ను శిఖా పాండే ఔట్ చేసింది. దాంతో ఇంగ్లండ్ 80 రన్స్ వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.