Womens T20 WC : టీమిండియా స్టార్ పేసర్ రేణుకా సింగ్ తొలి ఓవర్లోనే ఐర్లాండ్‌ను దెబ్బకొట్టింది. ఐదో బంతికి ప్రెండెర్గాస్ట్ను బౌల్డ్ చేసింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంటర్ రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ త్రో చేయడంతో వికెట్ కీపర్ రీచా ఘోష్ వికెట్లను గిరాటేసింది. దాంతో, 5 పరుగులకే ఆ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. లారా డెలాని (13), గాబి ల్యూయిస్ (27) దూకుడుగా ఆడుతున్నారు. వీళ్లిద్దరూ రెండో మూడో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్లు స్కోర్ 44/2.