Women’s T20 WC | న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం.. పొట్టి ప్రపంచకప్‌లో శుభారంభం
Women's T20 WC | దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో అసీస్ 97 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది.
పార్ల్: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో అసీస్ 97 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. అసీస్ జట్టు తన ముందుంచిన 174 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ జట్టు మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే 76 పరుగుల వద్ద చేతులెత్తేసింది.
అసీస్ బౌలర్ అష్లీ గార్డెనర్ కివీస్ టీమ్ నడ్డి విరించింది. కేవలం 12 పరుగుల మాత్రమే ఇచ్చి కీలకమైన ఐదు వికెట్లను పడగొట్టింది. దాంతో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ 14 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున అమెలియా కెర్ (21) టాప్ స్కోరర్‌గా నిలించారు. ఆ తర్వాత బెర్నాడిన్ బిజూడెన్హౌట్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
అంతకుముందు కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. బ్యాటర్ అలీసా హీలి (55), కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కాగా, తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన అసీస్ టీమ్ ట్రోఫీని గెలిచేందుకు వచ్చిన జట్లలో తాను హాట్ ఫేవరేట్‌గా ఉన్నానని నిరూపించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

