మస్కట్: మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో భారత్‌ను విజయం వరించింది. గోల్‌కీపర్ నిధి మూడు గోల్స్ అడ్డుకోవడం మన గెలుపులో కీలకమైంది.