ఒలింపిక్స్‌లో తొలి రోజు ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమైన భారత్ రెండో రోజు మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ఆదివారం సత్తా చాటారు. షూటింగ్లో మను భాకర్.. ఈ క్రీడలో ఇంతవరకూ మహిళలకు దక్కని గౌరవాన్ని దేశానికి తొలి పతకాన్ని అందించి శుభారంభం చేయగా తమ క్రీడలలో పోటీపడ్డ ఇతర మహిళా అథ్లెట్లు సైతం గెలిచి తదుపరి రౌండ్స్‌కు దూసుకెళ్లారు.
తెలుగు అమ్మాయిలు పీవీ సింధు, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజతో పాటు మనికా బాత్రా, రమిత జిందాల్ విజయనాదాలు చేశారు. షూటింగ్లో సోమవారం రమిత జిందాల్ సైతం మెడల్ ఈవెంట్‌కు దూసుకెళ్లి పతక ఆశలు రేపుతోంది. అయితే మహిళల ఆర్చరీ జట్టు నిరాశపరచింది.