PAKW vs SAW : వరల్డ్ కప్‌లో నాలుగు విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయం తర్వాత సఫారీ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. లారా వొల్వార్డ్త్(90) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరినే కాప్(68 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలో రెచ్చిపోయారు. ఆఖర్లో డీక్లెర్క్(41) సిక్సర్ల మోతతో జట్టు స్కోర్ మూడొందలు దాటించింది. వీరందరి వీరబాదుడుతో 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 312 రన్స్ కొట్టింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(0) సున్నాకే ఔటైనా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(90), సునే లుస్(61)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. వర్షం అంతరాయం తర్వాత డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 40 ఓవర్లకు కుదించగా.. పాక్ బౌలర్లను ఉతికారేశారు ఇద్దరూ. రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత నష్ర బౌలింగ్‌లో .. డయానా చేతికి క్యాచ్ ఇచ్చి లుస్ వెనుదిరిగింది. దాంతో.. 123 వద్ద సఫారీ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే వొల్వార్డ్త్ బౌండరీతో అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అనెరీ డెర్క్సెన్(8) 40 నిమిషాల తర్వాత వాన తగ్గడంతో సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు.
Wolvaardt – 90 (82)
Luus – 61 (59)
Kapp – 68* (43)
De Klerk – 41 (16)South Africa posts its highest total in a Women’s ODI World Cup and that too in just 40 overs. Pakistan needs a miracle to win in Colombo.#CWC25 Live ⬇️https://t.co/JUTShXiX8W pic.twitter.com/TbT1GEj5q6
— Sportstar (@sportstarweb) October 21, 2025
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా.. 6/1తో తిరిగి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(90), సునే లుస్(61)లు దూకుడుగా ఆడారు. రన్ రేటు 7కు తగ్గకుండా చూస్తూ.. బౌండరీలతో చెలరేగిన ఈ ద్వయం శతక భాగస్వామ్యంతో గట్టి పునాది వేసింది. లుస్ తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ మరినే కాప్(68 నాటౌట్) కూడా ధనాధన్ ఆడింది. వీరిద్దరూ కలిసి ఫిఫ్టీ రన్స్ రాబట్టారు. డయానా ఓవర్లో సిక్సర్తోసెంచరీకి చేరువైన లారా.. నష్రా ఓవర్లో స్టంపౌట్ అయింది. అనంతరం చోలే ట్రయాన్(21)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరించింది కాప్ కానీ, సడియా ఇక్బాల్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన ట్రయాన్.. చివబంతికి స్టంపౌట్ కాగా 253 వద్ద ఆరో వికెట్ పడింది.
వరుసగా రెండు వికెట్లు పడడంతో దక్షిణాఫ్రికా 280కే పరిమితం అవుతుదంనిపించింది. కానీ, ప్రపంచ కప్‌లో ఫినిషర్‌గా రాణిస్తున్న నడినే డీక్లెర్క్ (41) వస్తూ వస్తూనే పాక్ బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. ఫాతిమా సనా వేసిన 39వ ఓవర్లో 6, 4, 6, 6తో 25 పరుగులు పిండుకొన్న డీక్లెర్క్ స్కోర్ మూడొందలు దాటించింది. చివరి ఓవర్ తొలి బంతిని బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. మరో షాట్‌కు యత్నించి పర్వేజ్ చేతికి దొరికింది. మరినే సిక్సర్ సంధించగా 9 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 312 పరుగులు చేసింది.
What a cameo by Nadine de Klerk 💪
📺 Stream #CWC25 on DStv: https://t.co/rM90YyR504 #HereForHer | #SSCricket pic.twitter.com/7g92302OJM
— SuperSport 🏆 (@SuperSportTV) October 21, 2025