గాలె: సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ వీరసామి పెరుమాల్ (5/35) విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (73) రాణించగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వారికన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వర్షం కారణంగా మంగళవారం రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న విండీస్.. ప్రత్యర్థి స్కోరుకు 135 పరుగులు వెనుకబడి ఉంది. బ్లాక్‌వుడ్ (44) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ బ్రాత్‌వైట్ (22), బూనర్(1) క్రీజులో ఉన్నారు.