సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ
ఉస్మానియా యూనివర్సిటీ: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ పోటీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సంజన సిరిమల్ల పసిడి పతకంతో మెరిసింది. బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సంజన 6-4, 6-0తో ప్రతిభ నారాయణ్(జైన్ యూనివర్సిటీ)పై అద్భుత విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో ఓయూ ద్వయం సంజన, కొండవీటి అనుష్క6-2, 6-3తో అన్నా యూనివర్సిటీ జోడీ కార్తీక, కుందనశ్రీపై గెలిచింది. టైటిల్ గెలిచిన ఓయూ టెన్నిస్ బృందాన్ని అధికారులు సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.