T10 League | తొలి ఓవర్లోనే హ్యాట్రిక్.. రికార్డు సృష్టించిన విండీస్ స్పిన్నర్
T10 League : అబూదాబీ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ10 లీగ్(T10 League)లో వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్(Akeal Hosein) హ్యాట్రిక్ సాధించాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్(Newyork Strikers)కు ఆడుతున్న అకీల్ హొసేన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్...
T10 League : అబూదాబీ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ10 లీగ్(T10 League)లో వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్(Akeal Hosein) హ్యాట్రిక్ సాధించాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్(Newyork Strikers)కు ఆడుతున్న అకీల్ హొసేన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్(Hat-trick) తీసి ఔరా అనిపించాడు.
క్వాలిఫయర్ 1లో భాగంగా మొరిస్‌విల్లే సాంప్ ఆర్మీ(Morrisville Samp Army) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అకీల్ వరుస బంతుల్లో ఆండ్రీస్ గౌస్, డెవాల్డ్ బ్రెవిస్, ఇబ్రహీం జర్దాన్లను ఔట్ చేశాడు. అంతేకాదు 5 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అకీల్ హొసేన్ హ్యాట్రిక్ వీడియో
స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ స్ట్రైకర్స్ 5 వికెట్ల నష్టానికి 125 రన్స్ కొట్టింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(56) అర్ధ సెంచరీతో కదం తొక్కి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. భారీ ఛేదనలో మొరిస్‌విల్లే జట్టును అకీల్ తొలి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుసగా మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వికెట్లు తీసి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను న్యూయార్క్ స్ట్రైకర్స్ వైపు తిప్పాడు. దాంతో, న్యూయార్క్ స్ట్రైకర్స్ ఈ మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొంది.. దక్కన్ గ్లాడియేటర్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి
- Rinku Singh | రేపటి నుంచి టీ20 సమరం.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై రింకూ సింగ్ రియాక్షన్ ఇదే..!
- Minister Ponnam Prabhakar | రవాణా వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- Netflix Co Ceo | టాలీవుడ్ ప్రముఖులతో నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో సమావేశం.. ఫొటోలు వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

