Mahesh Babu – NTR | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో టెడ్ సరాండొస్ (Ted Sarandos) గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వచ్చిరాగనే నేరుగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాసానికి విచ్చేశారు. ఇక ఈ భేటీలో రామ్ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ భేటి తరువాత తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కుటుంబంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబును కలుసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ నివాసంలో ఎన్టీఆర్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, అన్న కల్యాణ్ రామ్, దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ కూడా నెట్‌ఫ్లిక్స్ టీమ్‌ను కలువగా.. గుంటూరు కారం సెట్‌కి నేరుగా వెళ్లిన టెడ్ సరాండొస్ (Ted Sarandos) అక్కడ మహేష్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలుసుకున్నాడు. అలాగే ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న అల్లు అర్జున్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్ తదితరులను నెట్ ఫ్లిక్స్ సీఈవో కలుసుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
It was such a pleasure hosting you and your team for lunch Ted Sarandos. Enjoyed our conversation and the afternoon spent together indulging in our love for movies and food. pic.twitter.com/aD82mcM2MY
— Jr NTR (@tarak9999) December 8, 2023
Coffee and chill!!
Some interesting conversations about the future of entertainment with the visionary #TedSarandos and his fabulous team #MonikaShergill #AbhishekGoradia@NetflixIndia pic.twitter.com/lpoXqMWz05— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2023
Netflix Ceo #TedSarandos Met Team #Devara, #Pushpa, #GunturuKaaram & Some Biggies In Tollywood 💥💥💥.
Most Talented Trio @tarak9999 ~ @alluarjun ~ @urstrulyMahesh ❤️🔥❤️🔥. pic.twitter.com/eaRX3vyXUx
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) December 9, 2023