Wimbledon : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ ఫైనల్ ఆసక్తి రేపుతోంది. గత సీజన్ ఫైనలిస్ట్‌లు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ల మధ్య నువ్వా నేనా అన్నట్టు టైటిల్ పోరు జరుగనుంది. దాంతో, రసవత్తరంగా సాగే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తనున్నారు. అందుకని నిర్వాహకులు సైతం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌ను సొమ్ము చేసుకునేందుకు టిక్కెట్ రేటును రూ. 3 కోట్లుగా నిర్ణయించారు.
జూలై 14 ఆదివారం రోజు సెంటర్ కోర్టులో జరిగే ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు రికార్డు ధర పలుకుతున్నాయి. వింబుల్డన్ ఫైనల్ పోరు కనీస ప్రారంభ టికెట్ ధర రూ. 8.85 లక్షలుగా ఉంది. ఇక సెంటర్ కోర్టుకు సమీపంగా ఉండే సీట్ల ధర రూ.31 లక్షలు కాగా.. మరికొన్ని సీట్ల ధర రూ. 3 కోట్లు ఉంది. దాంతో, ఈసారి వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లకు క్రీడా చరిత్రలో కనీవినీ ఎరుగని ధర పలికింది.
Nothing but respect from @DjokerNole 💯#Wimbledon pic.twitter.com/y2imjnGsL8
— Wimbledon (@Wimbledon) July 12, 2024
డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ వరుసగా రెండో ఏడాది ట్రోఫీపై గురి పెట్టాడు. 2023లో నొవాక్ జకోవిచ్‌ను చిత్తు చేసి తొలిసారి విజేతగా అవతరించిన స్పెయిన్ సంచలనం డబుల్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నాడు. మరోవైపు గత సీజన్ ఓటమికి బదులు తీర్చుకోవాలని జకోవిచ్ భావిస్తున్నాడు. దాంతో, ఇద్దరి మధ్య టైటిల్ పోరు ఫ్యాన్స్‌కు పైసా వసూల్ అనుభూతి ఇవ్వడం ఖాయం.