బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్(Wiaan Mulder) 367 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. త్రిశతకంతో ఆకట్టుకున్న ముల్డర్.. తృటిలో బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. టెస్టుల్లో లారా అత్యధికంగా 401 రన్స్ చేశాడు. అయితే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా.. ముల్డర్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చిందో చెప్పిండు. బ్రియాన్ లారా మీద ఉన్న గౌరవం వల్లే తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పాడు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 626 రన్స్ చేయగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 170 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 51 రన్స్ చేసింది.
బ్రియాన్ లారా ఓ లెజెండరీ ప్లేయర్ అని, అతను 410 రన్స్ స్కోర్ చేశాడని, ఆ స్టాయి ఆటగాడి రికార్డును అలాగే ఉంచడం గౌరవప్రదంగా ఉంటుందని ముల్డర్ తెలిపాడు. ఒకవేళ మళ్లీ 400 రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ వస్తే ఇలాగే చేయనున్నట్లు చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని కోచ్ శుక్రి కాన్రాడ్కు చెప్పినట్లు తెలిపాడు. తాను కూడా అదే చెప్పాడని, ఆ రికార్డు లెజెండ్ వద్దే ఉండనివ్వు అని, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ బ్రియాన్ లారా రికార్డు ఆయన ఖాతాకే ఉంటే సరిపోతుందన్నాడు.
గతంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హసీమ్ ఆమ్లా అత్యధికంగా టెస్టుల్లో 311 రన్స్ చేశాడు. ఆ రికార్డును ముల్డర్ బ్రేక్ చేశాడు. 2012లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా ఆ స్కోరు చేశాడు. త్రిపుల్ సెంచరీ చేసిన రెండవ సౌతాఫ్రికా ప్లేయర్‌గా ముల్డర్ నిలిచాడు. అత్యంత వేగంగా త్రిశతకం చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ముల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు.
ముల్డర్ తన ఇన్నింగ్స్‌లో 334 బంతులు ఆడాడు. దాంట్లో 49 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.