పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (64) రనౌట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఇబ్బండి పడుతున్నాడు. అదే సమయంలో ధవన్ కూడా నిదానంగా ఆడుతున్నాడు. దీంతో స్కోరుబోర్డు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టు 25 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 152 పరుగులతో నిలిచింది.