10 లక్షల కోసం నేను స్పాట్ ఫిక్సింగ్ చేస్తానా?: శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్

కొచ్చి: సరిగ్గా 8 ఏళ్ల కిందట 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎంత దుమారం రేపాయో తెలుసు కదా. ఆ ఆరోపణలు ఓ టీమిండియా స్టార్ పేస్ బౌలర్ కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాయి. అయితే ఇన్నాళ్లకు ఈ ఆరోపణలపై పబ్లిగ్గా నోరు విప్పాడు పేస్ బౌలర్ శ్రీశాంత్. కేవలం రూ.10 లక్షల కోసం నేను ఆ పని చేస్తానా అని శ్రీశాంత్ అనడం విశేషం. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన శ్రీ.. 2013లో జరిగిన విషయం గురించి వివరించాడు.
ఆ సమయంలో నేను ఇరానీ ట్రోఫీ ఆడాను. సౌతాఫ్రికా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాను. సెప్టెంబర్ 2013లో ఆ సిరీస్‌కు వెళ్లాల్సి ఉంది. అందులో ఆడటమే అప్పుడు నా లక్ష్యంగా ఉంది. అలాంటి వ్యక్తినైన నేను ఇలాంటి పని చేస్తానా? అది కూడా కేవలం రూ.10 లక్షల కోసమా? నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు కానీ.. గట్టిగా పార్టీ చేస్తే రూ.2 లక్షలు ఖర్చు పెడతా అని శ్రీశాంత్ చెప్పడం గమనార్హం.
అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులే తనను బయటపడేశారని అతడు చెప్పాడు. నా జీవితంలో నేను సాయం చేశాను. ఇతరుల్లో నమ్మకాన్ని నింపాను. చాలా మందికి సాయం చేశాను. వాళ్ల ప్రార్థనలే నన్ను దీని నుంచి బయటపడేశాయి అని శ్రీశాంత్ అన్నాడు. అంతేకాదు ఆ ఫిక్సింగ్ గురించి కూడా అతడు వెల్లడించాడు.
అది 14 పరుగులు ఇవ్వాల్సిన ఓవర్. నేను నాలుగు బాల్స్ వేసి ఐదు పరుగులు ఇచ్చాను. నోబాల్ వేయలేదు, వైడ్ వేయలేదు. ఒక్క స్లో బాల్ కూడా వేయలేదు. నా బొటనవేలికి 12 సర్జరీలు అయిన తర్వాత కూడా 130 కిలోమీటర్లకుపైగా వేగంతో బౌలింగ్ చేశాను అని శ్రీశాంత్ చెప్పాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో అతనికి క్లీన్చిట్ దక్కడంతో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం ఎత్తేశారు. దీంతో ఈ ఏడాది ముస్తాక్ అలీ టోర్నీతో అతడు మళ్లీ కాంపిటిటివ్ క్రికెట్లోకి వచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

