IND vs PAK : ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ సమరాల్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్ ఒకటి. టోర్నీ, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఇరుజట్లు జరిగిన ఎప్పుడు ఎదురుపడినా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే కాబోలు.. భారత జట్టు క్రికెట్ ఆడితే పాకిస్థాన్‌తో ఆడాలి.. బంగ్లాదేశ్‌తో ఆడితే ఏముంది కిక్కు అనే డైలాగ్ పుట్టుకొచ్చింది. అయితే.. వరల్డ్ కప్ చరిత్రలో దాయాదిపై టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది.
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ కాలం నుంచి.. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ వరకూ ఇదే ట్రెండూ కొనసాగింది. వన్డే, టీ20.. ప్రపంచకప్ ఏదైనా టీమిండియా చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఆసియా కప్‌లోనూ అదే ఫలితం పునరావృతం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
When India and Pakistan face off, every moment is history in the making! 🏏🙌🏻 Witness the ad-free LIVE screening of the Asia Cup 2025: IND vs PAK at PVR INOX on September 14 at 8:00 PM.
Book now: https://t.co/WyiWtS0CBM
.
.
.#AsiaCup2025 #LiveScreening #Cricket #IndVsPak… pic.twitter.com/WzlS0LXgVi— P V R C i n e m a s (@_PVRCinemas) September 12, 2025
ఒకప్పుడు పాక్‌తో మ్యాచ్ అంటే సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారులే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడుగా పక్కా విజయం మనదే అనే భావన ఉండేది. సచిన్, వీరూలు ఎప్పుడో వీడ్కోలు పలకగా.. రెండేళ్ల క్రితం టీ20లకు కోహ్లీ అల్విదా చెప్పేశాడు. సూర్యకుమార్ సారథ్యంలో జట్టుపై నమ్మకం లేదని కాదు కానీ.. ఈ దిగ్గజాల మాదిరిగా ఒత్తిడిని తట్టుకొని పాక్‌ను పడగొట్టే వీరుడు ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.
ICC announces Virat Kohli’s six against @HarisRauf14 as ‘Shot of the Century’ 💯@imVkohli • #ViratKohli𓃵 • #ViratGang pic.twitter.com/yg9435tVwp
— ViratGang.in (@ViratGangIN) November 8, 2023
ఎందుకంటే.. ఈమధ్య కాలంలో విరాట్, హిట్‌మ్యాన్, రవీంద్ర జడేజా వంటి మ్యాచ్ విన్నర్లు లేకుండా దాయాదితో భారత్ తొలిసారి తలపడుతోంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడమూ అందుకు కారణం. పాక్ అంటే శివాలెత్తిపోయే సీనియర్ల గైర్హాజరీలో.. కుర్రాళ్లు కసికొద్దీ కొట్టి చిరకాల ప్రత్యర్థిని వణికిస్తే అంతకంతే ఇంకేం కావాలి సగటు అభిమానికి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్.. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ చిరస్మరణీయమే. షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, వసీం అక్రమ్ లాంటి పాక్ పేస్ దళాన్ని ఉతికేస్తూ సచిన్ 98 రన్స్‌తో జట్టు విజయాన్ని తేలిక చేశాడు. స్వదేశంలో జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్‌లోనూ పాక్‌పై సచిన్ 85 పరుగులతో చెలరేగిపోయాడు.
Sachin Tendulkar 98 in 75 balls vs Pakistan #ONTHISDAY 01-03-2003 @ Centurion in World Cup. This was @sachin_rt one of the best world cup innings. 🇵🇰 set a target of 273 for 🇮🇳 which they achieved with 6 Wickets remaining. 12k runs for Sachin during ings.pic.twitter.com/pH3NlMtuyV
— Zohaib (Cricket King)🇵🇰🏏 (@Zohaib1981) March 1, 2024
మెల్బోర్న్ మైదానంలో హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో విరాట్ రెండు కళ్లు చెదిరే సిక్సర్లతో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. ఈ ఇద్దరిలా సమయోచితంగా, దూకుడగా ఆడగల ఆటగాళ్లు కావాలి భారత్‌కు ఇప్పుడు. ప్రస్తుతం ఆసియా కప్ స్క్వాడ్‌లోని పలువురికి పాక్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం అంతంత మాత్రమే. దాంతో.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాక్ భావిస్తోంది. అయితే.. పాక్ జట్టు ఎత్తుల్ని చిత్తు చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ బృందం పక్కాగా సిద్ధమవుతోంది.
ఆసియా కప్ ఆడుతున్న భారత స్క్వాడ్‌లోని కుర్రాళ్లకు ఐపీఎల్ అనుభవం ఉంది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందరూ హిట్టర్లే. వీళ్లందరికీ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేసినవాళ్లే. పైగా టీ20ల్లో వీరంతా సెంచరీలతో చెలరేగారు కూడా. తొలి బంతి నుంచి విధ్వంసక ఆట కొనసాగించే ఓపెనర్ అభిషేక్ స్ట్రయిక్ రేటులో కింగ్. మిస్టర్ 360 సూర్య ఆట గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్సీతో ప్రశంసలు అందుకున్న గిల్.. పొట్టి క్రికెట్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్ధుడు. తిలక్, శాంసన్, దూబేలు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడి చేయగలరు.
పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ అయినా.. ఛేజింగ్ అయినా పేసర్ షాహీన్ ఆఫ్రిది నుంచే భారత టాపార్డర్‌కు ముప్పు ఎదురవ్వనుంది. అయితే.. పవర్ ప్లేలో దంచుతూనే వికెట్ కాపాడుకుంటే.. ఆ తర్వాత స్కోర్‌బోర్డును ఉరికించేందుకు మిడిలార్డర్ కాచుకునే ఉంటుంది. బౌలింగ్ దళంలో బుమ్రా, అర్ష్‌దీప్.. కుల్దీప్, పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబేలు విజృంభిస్తే పాక్ బ్యాటర్లు తోకముడవాల్సిందే.
క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య వైరం ఈనాటిది కాదు. దాదాపు డెబ్భై ఏళ్ల నుంచి ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు ఆద్యంతం ఉత్కంఠతో పాటు అంతుపట్టని భావోద్వేగాలు అనేవి ఆటలో భాగమైపోయాయి. 1947లో దేశ విభజన తర్వాత దాయాదుల మధ్య 1952లో జరిగిన సిరీస్ నుంచి రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ వరకూ ఇండో -పాక్ మ్యాచ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.
పాక్‌తో తొలి టెస్టు నెగ్గిన తర్వాత సంబురాల్లో టీమిండియా ఆటగాళ్లు
అయితే.. ఈ ఏడాది పహల్గాంలో ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత శత్రు దేశంతో క్రికెట్ ఏంటీ? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ.. ద్వైపాక్షిక సిరీస్‌లు మినహా ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో దాయాదుల పోరుపై పలువురు అనాసక్తిగా ఉన్నా.. చాలామంది పాక్‌ను ఓడించి తీరాలని భావిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టీమిండియా.