మాంట్రీల్: కెనడా యువ సంచలనం విక్టోరియా ఎంబొకొ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 కెనడా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఆమె గెలుచుకుని ఈ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలైన కెనడా దేశస్తురాలిగా రికార్డులకెక్కింది.
ఫైనల్లో విక్టోరియా.. 2-6, 6-4, 6-1తో నవొమి ఒసాకా (జపాన్)ను ఓడించి తన తొలి కెనడా టైటిల్ను సాధించింది. ఈ విజయంతో ఆమె డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో టాప్-25లోకి దూసుకొచ్చింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను అమెరికా కుర్రాడు బెన్ షెల్టన్ గెలుచుకున్నాడు.