న్యూయార్క్: అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ త్వరలో కొత్త జీవితం ఆరంభించబోతున్నది. నటుడు, దర్శకుడు అండ్రియా ప్రెటీతో తన నిశ్చితార్థం ఖరారైనట్లు వీనస్ తాజాగా ప్రకటించింది. చాలా రోజుల తర్వాత తిరిగి బరిలోకి దిగిన వీనస్ తన తొలి విజయం తర్వాత జరిగిన మీడియా భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది.
తన(45) కంటే ఎనిమిదేండ్లు చిన్నవాడైన అండ్రియా(37)తో జీవితాన్ని పంచుకోబోతున్నట్లు వీనస్ పేర్కొంది. తాను తిరిగి బరిలోకి దిగేందుకు అండ్రియా మద్దతుగా నిలిచాడని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ఈ ఇటాలియన్ మోడల్ ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. గతేడాది ఇటలీలో బోటింగ్ సందర్భంగా వీనస్, అండ్రియా మధ్య ప్రేమాయణం మొదలైంది.