వడోదర: ఫామ్‌లో లేని బ్యాటర్ శుభమన్ గిల్‌ను టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో తన విధిని ఎవరూ మార్చలేరన్నారు. నా నుదుటి మీద ఏది రాసి ఉన్నా, దాన్ని నా నుంచి ఎవరూ తీసుకెళ్లలేరన్నారు. ఆదివారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న గిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నానని, నా విధిని నానుంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరని అన్నారు. ఇండియా తరపున ఇప్పటి వరకు గిలఠ్ 36 వన్డేలు ఆడారు. దాంట్లో అతను 869 రన్స్ చేశాడు. 28.03 సగటు, 138.59 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడతను. దేశం కోసం ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్లేయర్లు నమ్ముతారని, సెలెక్టర్లు వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకుంటారని, తానెప్పుడూ ఆ సందర్భాన్ని గడిపేస్తానని, జీవితం సింపుల్‌గా మారుతుందన్నారు. అయితే ఏ ఫార్మాట్ కూడా అనుకున్నట్లు ఈజీ కాదు అన్నారు. 2011 నుంచి ఇండియా వన్డే వరల్డ్‌కప్ నెగ్గలేదన్నారు. టీ20 జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు.
Bulls eye 🎯 pic.twitter.com/lOrJJVO6iD
— Shubman Gill (@ShubmanGill) January 10, 2026