WFI : ప్రో రెజ్లింగ్ లీగ్‌కు ముందు ఒలింపిక్స్ విజేత అమన్ సెహ్రావత్(Aman Sehrawat)కు భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అతడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. పారిస్ విశ్వక్రీడల్లో కాంస్యం గెలుపొందని అమన్ ఇకపై కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఆమోదం లభించింది. అలానే యువ రెజ్లర్ నేహా సాంగ్వాన్ (Neha Sangwan)పై కూడా సస్పెన్షన్ ఎత్తివేసింది డబ్ల్యూఎఫ్ఐ. దాంతో.. వీరిద్దరూ త్వరలో జరుగబోయే ప్రో రెజ్లింగ్ లీగ్ (PWL)వేలంలో పాల్గొనే అవకాశముంది.
ఈ ఏడాది క్రొయేషియాలోని జగ్రెబ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడాల్సిన అమన్ బరువు పెరిగాడు. నేహ సైతం అధిక బరువు కారణంగా బల్గేరియాలో జరిగిన జూనియర్ వరల్డ్స్ పోటీలకు అర్హత సాధించలేదు. అందుకని వీరిద్దరి నుంచి వివరణ కోరింది డబ్ల్యూఎఫ్ఐ. సెప్టెంబర్ 18న నేహ, సెప్టెంబర్ 28న అమన్ రిప్లై ఇచ్చారు.
AMAN SEHRAWAT, ONLY MALE WRESTLER FROM INDIA IN PARIS – has won a medal. 💪 pic.twitter.com/BbOCI1Lu2d
— Johns. (@CricCrazyJohns) August 9, 2024
మొదటి తప్పిదం కాబట్టి తమను మన్నించాలని ఇద్దరూ కోరారు. నవంబర్ 13న డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో అమన్, నేహ గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారి విజయాలను దృష్టిలో పెట్టుకొని నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించారు అధికారులు. మరోసారి ఇదే పొరపాటుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరిని హెచ్చరించారు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్.
The Wrestling Federation of India (WFI) has reinstated both Olympic bronze medallist Aman Sehrawat and U-20 world medallist Neha Sangwan after suspensions tied to first-time weight‐management lapses.
Aman was disqualified at the 2025 World Championships for being 1.7 kg over… pic.twitter.com/zXWk6cv3o3
— The Bridge (@the_bridge_in) November 14, 2025