అంటిగ్వా: కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (71), జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45), సామ్ కరన్ (38) తలా కొన్ని పరుగులు చేశారు.
వెస్టిండీస్ బౌలర్లలో షెఫర్డ్, మోతీ, ఓషానో థామస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసింది. హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా.. అలిక్ అథన్జే (66), రొమారియో షెఫర్డ్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.