ముల్తాన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 120 రన్స్ తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. ఇవాళ ఆట మూడవ రోజున పాకిస్థాన్‌ను 133 రన్స్‌కే ఆలౌట్ చేసింది విండీస్. స్పిన్నర్ జోమెల్ వారికన్(Jomel Warrican) అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లు తోకముడిచారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వారికన్ 27 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో అతని ఖాతాలోకి 19 వికెట్లు చేరాయి.
The main architect behind the historic win.
What a performance from our left arm spinner.#PAKvWI | #MenInMaroon pic.twitter.com/XpDHDBaGj4
— Windies Cricket (@windiescricket) January 27, 2025
ఈ ఓటమితో పాకిస్థాన్.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టేబుల్లో దిగువ స్థానానికి పడిపోయింది. సోమవారం 4 వికెట్లకు 76 రన్స్ వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్.. ప్రారంభంలోనే ఓవర్‌నైట్ బ్యాటర్లను కోల్పోయింది. ముల్తాన్ మైదానంలో జరిగిన ఫస్ట్ టెస్టులో.. వెస్టిండీస్ 127 రన్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టును అదే వేదికపై ఆడినా.. విండీస్ స్పిన్నర్ వారికన్ ఉచ్చులో పాక్ బ్యాటర్లు పడిపోయారు.
West Indies win the second Test by 120 runs to level the series 1-1.#PAKvWI | #RedBallRumble pic.twitter.com/i1dWj8zGNO
— Pakistan Cricket (@TheRealPCB) January 27, 2025
ఈ ఓటమితో డబ్ల్యూటీసీ టేబుల్లో పాక్ 9వ స్థానాన్ని, విండీస్ 8వ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.