West Indies గయానా: పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సీలో భాగంగా గయానా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ చార్లెస్ (44), రస్సెల్ (30) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
భారీ ఛేదనలో ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని ఎదుర్కొంది. ఆ జట్టులో జుమ మియాగి (13) ఒక్కడే రెండంకెల స్కోరుచేశాడు. విండీస్ స్పిన్నర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అకీల్ హోసెన్ (5/11) ఐదు వికెట్ల విజృంభణతో ఉగాండాను కోలుకోనీయలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ (39) తర్వాత ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.