బ్రెడీ: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. కరీబియన్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (44 బంతుల్లో 91, 7 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ షై హోప్ (27 బంతుల్లో 51, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర విధ్వంసానికి తోడు ఆఖర్లో కార్టీ (22 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గతంలో ఆ జట్టు సౌతాఫ్రికాపై 258/5 పరుగులు చేసింది. ఇక ఛేదనలో ఐర్లాండ్.. 20 ఓవర్లలో 194/7 వద్దే ఆగిపోవడంతో విండీస్ 62 పరుగుల తేడాతో గెలిచింది.