West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 24న ఇండియాలో అడుగుపెట్టనున్న కరీబియన్ టీమ్ మ్యాచ్ సన్నద్ధతకు అహ్మదాబాద్‌లో ఆరు రోజుల క్యాంప్‌లో పాల్గొననుంది. ఈ విషయాన్ని బీసీసీఐతో పాటు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించాయి. సెప్టెంబర్ 24 నుంచి 29 వరకూ స్థానిక నరేంద్ర మోడీ స్టేడియంలో విండీస్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది.
భారత్‌తో టెస్టు సిరీస్ కోసం ఈమధ్యే రోస్టన్ ఛేజ్ సారథిగా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను వెస్టిండీస్ సెలెక్టర్లు ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఆడిన స్క్వాడ్‌లోని ముగ్గురిని మార్చేశారంతే. వాళ్ల బదులు సుదీర్ఘ ఫార్మాట్‌కు కొంతకాలంగా దూరమైన తంగ్నరైన్ చందర్‌పాల్‌ను, మిడిలార్డర్ బ్యాటర్ అలిక్ అథనాజే, స్పిన్నర్ ఖారీని తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే.. తమ ప్రధాన స్పిన్నర్ మోతీని మాత్రం పక్కన పెట్టేశారు. భారత్, విండీస్ మధ్య అక్టోబర్ 2న తొలి టెస్టు మొదలవ్వనుంది.
A maiden Test call-up and some notable returns in the West Indies squad for the two-Test #WTC27 series against India 📋
More ➡️ https://t.co/byX0lWnyTu pic.twitter.com/JJkjouxECo
— ICC (@ICC) September 17, 2025
వెస్టిండీస్ స్క్వాడ్ : రోస్టన్ ఛేజ్(కెప్టెన్), జొమెల్ వర్రికన్, కెవ్లోన్ అండర్సన్, అలిక్ అథనాజే. జాన్ క్యాంప్‌బెల్, తంగ్నరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇంప్లిచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, అండర్సన్ ఫిలిప్, ఖారీ పియెర్రీ, జైడన్ సీల్స్.