WI vs BAN : మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ (West Indies) బోణీ కొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. సూపర్ ఓవర్లలో విండీస్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 214 పరుగుల ఛేదనలో షాయ్ హోప్ సేన.. స్కోర్ సమం చేసింది. దాంతో.. సూపర్ ఓవర్ ఆడించగా మొదట విండీస్ వికెట్ నష్టానికి 10 రన్స్ చేసింది. అనంతరం బంగ్లా వికెట్ కోల్పోయి 9 రన్స్ చేసింది. ఒకేఒక పరుగుతో గెలుపొందిన కరీబియన్ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
మిర్పూర్లో జరిగిన రెండో వన్డేలో విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బంగ్లా సౌమ్యా సర్కార్ (45), రిచర్డ్ హొసేన్ (39 నాటౌట్) మెరుపులతో 213 రన్స్ చేసింది. ఛేదనలో ఆతిథ్య జట్టు బౌలర్లను విజృంభణతో విండీస్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. ఓపెనర్లు విఫలంకాగా.. కెప్టెన్ షాయ్ హోప్ (53), కేసీ కార్టీలు (35) రాణించడంతో గెలపు దిశగా సాగింది. అయితే.. రిషద్ హొసేన్ (3-42) తిప్పేయడంతో ఆలౌట్ ప్రమాదంలో పడింది.
After 813 matches before today across formats – 453 ODIs, 154 Tests and 206 T20Is – Bangladesh have been involved in their first tie 😲 pic.twitter.com/427LJHBsVH
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2025
బంగ్లా బౌలర్లు టెయిలెండర్లను కట్టడి చేయడంతో 50 ఓవర్లకు విండీస్ కూడా 213 రన్స్ చేసింది. ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో. అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. బంగ్లా తరఫున పేసర్ ముస్తాఫిజుర్.. కరీబియన్ తరఫున అకీల్ హొసేన్లు సూపర్ ఓవర్ వేశారు. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 23న మూడో వన్డే జరుగనుంది.