Jayden Seals | జమైకా: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (4/5) అద్భుత స్పెల్‌తో పర్యాటక జట్టు విలవిల్లాడింది. సీల్స్‌తో పాటు షమర్ జోసెఫ్ (3/49) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 164 పరుగులకు ఆలౌట్ అయింది. షద్మాన్ ఇస్లామ్ (64), కెప్టెన్ మెహది హసన్ మిరాజ్ (36) బంగ్లా పరువు నిలిపారు. కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో 46 ఏండ్ల తర్వాత సీల్స్ (15.5 ఓవర్లు, 10 మెయిడిన్లు.. 5 పరుగులు.. 4 వికెట్లు) అత్యంత పొదుపైన స్పెల్‌ను నమోదు చేశాడు. విండీస్ రెండో రోజు ఆట ముగిసే సరికి 70/1 స్కోరు చేసింది.