WI vs NEP : దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో నేపాల్ బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వెస్టిండీస్ టాపార్డర్‌ను చుట్టేశారు. ఓపెనర్ కైలీ మేయర్స్(5) రనౌట్ కాగా.. స్పిన్నర్ల విజృంభణతో, 53 పరుగులకే కరీబియన్ టీమ్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేసీ కార్టీ( 8 నాటౌట్), నవీ న్ బిడైసీ(1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. పది ఓవర్లకు స్కోర్.. 56-4. ఇంకా విండీస్ విజయానికి 93 రన్స్ కావాలి.
ఒకప్పుడు టీ20ల్లో వీరబాదుడుకు కేరాఫ్ అయిన వెస్టిండీస్ ఈమధ్య తడబడుతోంది. నేపాల్‌తో జరుగుతున్న పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు టాపార్డర్ తేలిపోయింది. డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (5) రెండో ఓవర్లోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత అమిర్ జంగూ(19), అకీమ్ అగస్టే (15)లు రెండో వికెట్‌కు 27 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని నందన్ యాదవ్ విడదీశాడు. కాసేపటికే జెవెల్ ఆండ్రూ(5)ను రోహిత్ పౌడెల్ పెవిలిన్ పంపాడు.
𝑾𝒆𝒔𝒕 𝑰𝒏𝒅𝒊𝒆𝒔 𝒂𝒓𝒆 𝒊𝒏 𝒅𝒆𝒆𝒑 𝒕𝒓𝒐𝒖𝒃𝒍𝒆 𝒊𝒏 𝑺𝒉𝒂𝒓𝒋𝒂𝒉! 🤯
Nepal’s bowlers are wreaking havoc as the Caribbean side has lost four wickets for just 53 runs. 🇳🇵🔝
Can Nepal defeat West Indies from here? 👀🏏#WIvNEP #T20Is #Sharjah #Sportskeeda pic.twitter.com/XBhnpY5oLU
— Sportskeeda (@Sportskeeda) September 27, 2025
టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కెప్టెన్ అకీల్ హొసేన్ అంచనాలు తప్పాయి. నేపాల్‌ను తక్కువకే కట్టడి చేయాలనుకున్న ఆ జట్టు భారీ స్కోర్ సమర్పించుకుంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్(38), కుశాల్ మల్లా (30), గుల్షన్ ఝా(22)లు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సిక్సర్లతో చెలరేగారు. అయితే.. ఆఖర్లో పుంజుకున్న కరీబియన్ బౌలర్లు వికెట్లు తీశారు. హోల్డర్ 19వ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది నేపాల్.