చత్తోగ్రమ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కెప్టెన్ షై హోప్ (46*), రొవ్మన్ పావెల్ (44*) దూకుడుగా ఆడటంతో 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. ఛేదనలో బంగ్లా 19.4 ఓవర్లలో 149 రన్స్కే కుప్పకూలింది.