బార్బడోస్: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్(West Indies vs England)ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. బార్బడోస్‌లో జరిగిన మూడవ వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. విండీస్ బ్యాటర్లు కీసీ కార్టీ, బ్రండన్ కింగ్‌లు సెంచరీలతో చెలరేగారు. 264 టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్.. మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నది. కార్టీ 128, కింగ్ 102 రన్స్ చేశారు. వన్డేల్లో కార్టీ తొలి సెంచరీ నమోదు చేశాడు. 97 బంతుల్లో అతను సెంచరీ కొట్టాడు. 128 రన్స్‌తో అతను నాటౌట్‌గా నిలిచాడు. కింగ్ 113 బంతుల్లో వన్డేల్లో మూడవ సెంచరీ నమోదు చేశాడు.
An historic day in Barbados for Keacy Carty, the West Indies and the small Caribbean island of Sint Maarten 😲
Details 👇https://t.co/srUmJEiUaw
— ICC (@ICC) November 7, 2024
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తడబడింది. ఓ దశలో 10 ఓవర్లలో 24 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 74 రన్స్ స్కోర్ చేశాడు. సామ్ కరన్ 40, డాన్ మోస్లే హాఫ్ సెంచరీ చేశారు. చివరలో జోఫ్రా ఆర్చర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శనివారం నుంచి రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానున్నది.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్ 263-8 (50 ఓవర్లు): ఫిల్ సాల్ట్ 74 (108); ఫోర్డ్ 3-35
వెస్టిండీస్ 267-2 (43 ఓవర్లు): కార్టీ 128*(114), కింగ్ 102 (117); ఓవర్టన్ 1-17