West Indies | ట్రినిడాడ్: కొద్దిరోజుల క్రితమే స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వెస్టిండీస్.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో సఫారీలను 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 3-0తో గెలుచుకుంది.
వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (40) ధాటిగా ఆడాడు. విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్దేశించగా షై హోప్ (42 నాటౌట్), నికోలస్ పూరన్ (35) వేగంగా ఆడి 9.2 ఓవర్లలోనే గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.