తరౌబా (ట్రినిడాడ్): టీ20 వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ వరుస విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్ ఓడించింది. ట్రెంట్ బౌల్ట్ (3/16), సౌథీ (2/21) కట్టడి చేయడంతో కరేబియన్ టాపార్డర్ విఫలమైనా ఏడో స్థానంలో వచ్చిన షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ (39 బంతుల్లో 68, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 149/9 పరుగులు చేసింది.
అనంతరం కివీస్.. నిర్ణీత ఓవర్లలో 136/9 వద్దే ఆగిపోయింది. అల్జారీ జోసెఫ్(4/19), గుడకేశ్ మోటీ (3/25) రాణించారు. వరుసగా రెండు ఓటములతో కివీస్.. పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్ నుంచే ‘ఎలిమినేట్’ అయ్యే ప్రమాదంలో పడింది.