Asia Cup 2023 : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక స్పిన్ ఉచ్చుతో భారత్‌ను దెబ్బకొట్టింది. దాంతో ఇండియా 213 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ(53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్(39), ఇషాన్ కిషన్(33) మాత్రమే రాణించారు. లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే(Dunith Wellalage) 5 వికెట్లతో అదరగొట్టాడు. చరిత అసలంక కూడా 4 వికెట్లతో విజృంభించాడు.
ఒకదశలో స్కోర్ 200 దాటుతుందా? లేదా? అనిపించింది. అయితే.. అక్షర్ పటేల్(26) మహమ్మద్ సిరాజ్(5 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు విలువైన 26 రన్స్ జోడించాడు. 49వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడిన అక్షర్ పటేల్ బౌండరీ వద్ద సమరవిక్రమ చేతికి చిక్కాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
☝️ Rohit Sharma
☝️ Shubman Gill
☝️ Virat Kohli
☝️ KL Rahul
☝️ Hardik PandyaWhat a spell from Dunith Wellalage! He becomes the youngest Sri Lankan to take a five-wicket haul in men’s ODIs 🔥 #SLvIND LIVE 👉 https://t.co/yjh54eDXBm#AsiaCup2023 pic.twitter.com/edkzHuMzQW
— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2023
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. ఊహించినట్టుగానే ఓపెనర్లు రోహిత్ శర్మ(53), శుభ్‌మన్ గిల్(19) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 80 రన్స్ జోడించారు. అయితే.. వెల్లలాగే రాకతో మ్యాచ్ ఒక్కసారిగా లంక వైపు తిరిగింది. ఈ యంగ్‌స్టర్ తన తొలి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్(19)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రోహిత్ శర్మ(53), కోహ్లీ(3)ని వెనక్కి పంపాడు.
అంతేకాదు క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్(39)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. దాంతో, భారత్ కోలుకోలేకపోయింది. ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్(33)ను చరిత అసలంక ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా(5)ను ఔట్ చేసిన వెల్లలాగే 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వా రవీంద్ర జడేజా(4), జస్ప్రీత్ బుమ్రా(5) కుల్దీప్ యాదవ్(0)లను వరుస బంతుల్లో అసలంక ఔట్ చేశాడు.