న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు సార్లు బంగారు పతకాలు గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చాను డోప్ టెస్టులో విఫలమైంది. దాంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించారు. అనబాలిక్ స్టెరాయిడ్, డ్రోస్టనోలోన్ మెటబాలైట్ అనే డ్రగ్స్.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA)కి చెందిన నిషేధ మాదకద్రవ్యాల జాబితాలో ఉన్నాయి.
అయితే, సంజిత చానుకు ఇటీవల నిర్వహించిన డోపింగ్ టెస్టులో ఆమె.. అనబాలిక్ స్టెరాయిడ్, డ్రోస్టనోలోన్ మెటబాలైట్ అనే డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. దాంతో ఆమెపై నిషేధం విధించారు. సంజిత చానుపై తాజాగా నాలుగేళ్లపాటు నిషేధం విధించిన విషయాన్ని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ వెల్లడించారు.
మణిపూర్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ సంజిత చాను తాజా డోపింగ్ టెస్టుపై స్పందించాల్సి ఉంది. కాగా, సంజిత 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది.