హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజతం నెగ్గిన వెయిట్ లిఫ్టర్ ధారావత్ గణేశ్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. హకీంపేట క్రీడా పాఠశాలకు చెందిన గణేశ్ ఖేలో ఇండియా వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ 81 కిలోల విభాగంలో రజతం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మంత్రి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో అతడిని అభినందించారు. అనంతరం ఆర్చరీలో జాతీయ శిక్షణకు ఎంపికైన శ్రీను, అభినయ్, శివసాయిలను కూడా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో హకీంపేట క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి హరికృష్ణ, కోచ్‌లు పాల్గొన్నారు.