Wasim Akram | స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సుదీర్ఘకాలం తర్వాత 0-3 తేడాతో భారత్ వైట్‌వాష్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ పిచ్‌లపై పాకిస్థాన్ సైతం భారత్‌ను టెస్టుల్లో ఓడిస్తుందని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం అక్రమ్ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో స్పోర్ట్స్ ఛానెల్‌కు కామెంటేటర్‌గా పని చేస్తున్నాడు. స్పిన్ ట్రాక్‌లపై టెస్టుల్లో భారత్‌ను ఒడించే అవకాశం పాకిస్థాన్‌కు ఉందన్నారు.
న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలైందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అక్రమ్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే, పాకిస్థాన్ పసికూన బంగ్లాదేశ్‌పై ఓటమిని మాజీ బౌలర్ మరిచిపోయి ఉంటాడని పలువురు మాజీలు పేర్కొన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌ను 2-0 తేడాతో బంగ్లా మట్టి కనిపించగా.. ఆ తర్వాత ఆందోళనకు గురైన పీసీబీ.. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ నుంచి బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా తదితర వెటరన్ ఆటగాళ్లను పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రావల్పిండి వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో వరుసగా పాక్‌పై బంగ్లా పది, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ ఓటమిపై ప్రపంచవ్యాప్తంగా పాక్ క్రికెట్ పరువు పోయింది. అయితే, కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్నది. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం తర్వాత.. న్యూజిలాండ్‌పై సైతం మంచి ప్రదర్శన చేస్తుందని భావించినా.. అంతుకు భిన్నగంగా ఘోర ఓటమిని మూటగట్టుకున్నది. మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ దారుణ విఫలమైంది. మూడు అంతకంటే ఎక్కువ మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్స్వీపన్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకు ముందు ఇంగ్లండ్ నాలుగుసార్లు, ఆస్ట్రేలియా మూడసార్లు, వెస్టిండిస్ ఒకసారి క్లీన్‌స్వీప్ చేసింది.