ఇండోర్: న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆదివారం ఇండోర్లో మూడవ వన్డే జరగనున్నది. అయితే ఆ మ్యాచ్లో ఆడేందుకు ఇండోర్ వెళ్లిన కెప్టెన్ శుభమన్ గిల్( Shubman Gill) తన వెంట ఓ వాటర్ ఫ్యూరిఫయర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు మూడు లక్షలు ఖరీదు చేసే నీటి శుద్ధి మెషీన్ను గిల్ తన వెంబట తీసుకెళ్లినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఆ వాటర్ ఫ్యూరిఫయర్ ప్రత్యేకమైందని, ఆర్వో నీటినైనా లేక బాటిల్ వాటర్నైనా ఆ డివైస్ రీ-ప్యూరిఫై చేస్తుందని చెబుతున్నారు. \
పర్సనల్ హోటల్ రూమ్లో ఆ ఫ్యూరిఫయర్ను గిల్ ఇన్స్టాల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం కామెంట్ చేసేందుకు టీం మేనేజర్ నిరాకరించారు. ఇటీవల ఇండోర్లో నీటి కాలుష్యం వల్ల ఓ కాలనీలో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. నెంబర్ వన్ క్లీన్ సిటీగా అనేక సార్లు అవార్డు గెలుచుకున్న ఇండోర్లో నీటి కాలుష్యం సమస్య తీవ్రమైంది. బహుశా ఆ సంక్షోభం వల్లే గిల్ వ్యక్తిగతం నీటి ఫ్యూరిఫయర్ను తీసుకొచ్చి ఉంటాడని భావిస్తున్నారు.