RCB team : ఏకంగా 18 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఐపీఎల్ ట్రోపీ (IPL trophy) కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ టీమ్ (RCB team) మరికాసేపట్లో బెంగళూరు (Bengalore) కు చేరుకోనుంది. ఇప్పటికే ఆ జట్టు అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి విమానంలో బయలుదేరింది. ఈ క్రమంలో ఆర్సీబీ టీమ్ రాకకోసం బెంగళూరు ఎయిర్‌పోర్టు (Bengalore airport) దగ్గర ఎదురుచూస్తున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో సందడి నెలకొంది. ‘ఆర్సీబీ.. ఆర్సీబీ..’ నినాదాలతో ఎయిర్‌పోర్టు పరిసరాలు మార్మోగుతున్నాయి. ఈ శుభ సందర్భం కోసం తాము 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, ఇన్నాళ్లకు మా కల సాకారమైందని ఓ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు.
చాలాకాలం తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలువడం తమకు పండుగ లాంటిదని, ఇవాళ జరిగే సంబురాల్లో పాల్గొనడం కోసం తాను ఆఫీసుకు సెలవు పెట్టానని మరో అభిమాని తెలిపాడు. ఇవాళ ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్పుతో వస్తుండటం తమకు ఎంతో థ్రిల్‌గా ఉందని, ఇవాళ ఒక పండుగలా అనిపిస్తోందని ఇంకో అభిమాని ఆనందం వ్యక్తం చేశాడు. బెంగళూరులో అభిమానుల సందడికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Karnataka: RCB fans chant for their favourite IPL team as they await their arrival in Bengaluru city. RCB lifted their maiden IPL trophy last night, after beating Punjab Kings in #IPLFinals. pic.twitter.com/KlvCBdkEmz
— ANI (@ANI) June 4, 2025
#WATCH | An RCB fan says, “We are thrilled that the cup is coming home, to Namma Ooru Bengaluru. We are happy…All Kannadigas are very proud of this. Welcome home RCB.” pic.twitter.com/epvPFL6FvV
— ANI (@ANI) June 4, 2025
#WATCH | Bengaluru: An RCB fan, Pramod says, “We waited 18 years. The entire RCB team has waited 18 years for this victory. We cheer for the entire RCB team…” pic.twitter.com/VOJCYAhOuR
— ANI (@ANI) June 4, 2025
#WATCH | Bengaluru: An RCB fan says, “It is a blessing that we won the cup. We were waiting for the past 18 years. Yesterday was the day we won it…It is a big festival for us. We are celebrating at a high level. I am on leave today for the celebration.” pic.twitter.com/RVG2ApVZxo
— ANI (@ANI) June 4, 2025