INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో రెండో విజయంపై కన్నేసిన భారత ఏ జట్టు ఒమన్(Oman)ను తక్కువకే కట్టడి చేసింది. ఆరంభంలో ఓపెనర్ హమ్మద్ మిర్జా(32) మెరుపులకు విజయ్‌కుమార్(1-34 ) చెక్ పెట్టగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ (2-12) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే.. ఓవైపు వికెట్లు పడుతున్నా వసీం అలీ(54 నాటౌట్) కెరీర్లో తొలి టీ20 అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ఒమన్ నిర్ణీత ఓవర్లో 135 పరుగులు చేసింది. పాక్ చేతిలో కంగుతిన్న టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడేయాలంటే టాపార్డర్ చెలరేగాల్సిందే.
దోహాలో టాస్ ఓడిన ఒమన్ ఏ పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓపెనర్లు హమ్మద్ మిర్జా(32), కరన్ సొనవాలే(12)లు పవర్ ప్లేలో భారత ఏ బౌలర్లను ఉతికేస్తూ శుభారంభమిచ్చారు. నాలుగో ఓవర్లో హమ్మద్ వికెట్ తీసిన విజయ్ కుమార్ (1-34)భారత్‌కు తొలి బ్రేకిచ్చాడు. కాసేపటికే కరన్‌ను సుయాశ్ శర్మ(2-12) ఔట్ చేశాడు.
Innings Break!
2⃣ wickets each for Suyash Sharma and Gurjapneet Singh 👌
1⃣ wicket each for Vijaykumar Vyshak, Harsh Dubey, and Naman Dhir 👏Over to our batters as India A need 136 runs to win 👍
Scorecard ▶️ https://t.co/F9u6OP8Yqd#RisingStarsAsiaCup pic.twitter.com/jdHCxsX6Oc
— BCCI (@BCCI) November 18, 2025
రెండు వికెట్లు పడినా సరే నారాయణ్ సాయిశివ(16) సాయంతో వసీం అలీ(54 నాటౌట్) స్కోర్ బోర్డును నడిపించాడు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా ఒమన్ బ్యాటర్లకు కలిసొచ్చింది. సాయిశివ, ఆర్యన్ బిష్త్(4) అండతో వసీం స్కోర్ 120 దాటించాడు. 19వ ఓవర్లో సింగిల్ తీసి టీ20ల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. గుర్జన్‌పీత్ సింగ్ చివరి ఓవర్లో రెండు వికెట్లు తీయగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.