Wasim Akram: మీ ఆవిడ చాలా హాట్‌గా ఉందన్న నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వసీం అక్రమ్
Wasim Akram: ఓ ఆకతాయి అక్రమ్ భార్యను ‘ఆమె చాలా హాట్‌గా ఉంది..’ అని కామెంట్ చేశాడు. దీనికి వసీం అక్రమ్ కూడా అతడికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
Wasim Akram: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ పరిచయం అక్కర్లేని పేరు. స్వింగ్ సుల్తాన్‌గా పేరున్న అక్రమ్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర కామెంట్స్ ఎదుర్కున్నాడు. ఓ ఆకతాయి అక్రమ్ భార్యను ‘ఆమె చాలా హాట్‌గా ఉంది..’ అని కామెంట్ చేశాడు. దీనికి వసీం అక్రమ్ కూడా అతడికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అక్రమ్ రిప్లై ఇచ్చిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
57 ఏండ్ల ఈ పాక్ పేసర్.. 2024 జనవరి ఒకటిన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భార్య షనీరాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ కొత్త ఏడాది మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మా తరఫున కోరుకుంటున్నాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి సయీమ్ అలి 2023 అని ఉన్న ఓ యూజర్ స్పందిస్తూ… ‘ఉఫ్.. షీ ఈజ్ సచ్ ఎ హాట్ వైఫ్’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై అక్రమ్ స్పందిస్తూ.. ‘నువ్వు చెప్పింది సరైనదని నువ్వు అనుకుంటున్నావా..? నేను మీ తల్లిదండ్రులను కలవాలని అనుకుంటున్నా. వారితో నువ్వు ఏం చెప్పాలో చెప్పాలనుకుంటున్నా..’ అని రిప్లై ఇచ్చాడు.
Wasim Akram not coming slow 👏🏼 pic.twitter.com/H221SvNJS6
— Saad Kaiser 🇵🇰 (@TheSaadKaiser) January 6, 2024
మొదటి భార్య హ్యూమా మఫ్టీ అనారోగ్య కారణాలతో చనిపోయిన (2009లో) తర్వాత అక్రమ్..2013లో ఆస్ట్రేలియాకు చెందిన సోషల్ వర్కర్ షనీరా థాంప్సన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2014లో షనీరా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక పాక్ జట్టు ఆడే మ్యాచ్‌లకు క్రికెట్ కామెంటేటర్‌గా పనిచేస్తున్న అక్రమ్.. ఇటీవల ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఫాక్స్ క్రికెట్లో వ్యాఖ్యాతగా తనదైన మేనరిజమ్స్‌తో అలరించాడు. మార్క్ వా, ఆడం గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్ వంటి వారితో కలిసి కామెంట్రీ చెప్పాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా వైట్ వాష్ చేసింది.
Wasim Akram on Australians pronouncing the name Fakhar 😂pic.twitter.com/vQaVB3NUZv
— Cricketopia (@CricketopiaCom) January 7, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

