Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరణ.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరువనంతపురం: డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. (Bank Refuses To Return Deposi) కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. మారుత్తూరుకు చెందిన 52 ఏళ్ల సోమసాగరం, పెరుంపఝూత్తూర్ సహకార బ్యాంకులో ఐదు లక్షలు డిపాజిట్ చేశాడు. అయితే కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరాడు. ఆరు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.
కాగా, ఆత్మహత్య చేసుకుంటానని సోమసాగరం బెదిరించినప్పటికీ బ్యాంకు సిబ్బంది స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఏప్రిల్ 19న విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ నేపథ్యంలో 86 ఏళ్ల సోమసాగరం తండ్రి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

