MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. తుషారా వేసిన నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) క్యాచ్ ఔటయ్యాడు. తొలి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 14/1.
కాగా, ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా ఆడిన 10 మ్యాచ్‌ల్లో మూడింట్లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది.