Bumrah vs Siraj : భారత జట్టులో బెస్టు బౌలర్ ఎవరు?.. ఈ ప్రశ్న చిన్నపిల్లాడిని అడిగినా ఇంకెవరు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఇకపై ఈ సమాధానం మారనుంది. అవును.. టీమిండియా అత్యుత్తమ పేసర్ ఎవరు? అనడితే.. మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) అని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఒకప్పుడు సపోర్టు బౌలర్ అనిపించుకున్న అతడు ప్రధాన బౌలర్ అనే స్థాయికి ఎదిగాడు. పర్యటనలో వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా మూడు మ్యాచ్‌లకే పరిమితం కాగా.. ఏమాత్రం విశ్రాంతి కోరకుండా ఐదుకు ఐదు టెస్టులు ఆడాడీ పేస్ గన్. అందుకే ఈ హైదరాబాదీనే భారత బౌలింగ్ దళపతి అని పలువరు దిగ్గజాలు ముక్తకంఠంతో చెబుతున్నారు. పాకిస్థాన్ వెటరన్ వసీం అక్రమ్ (Wasim Akram) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్రికెట్లో ఒక్క సిరీస్ చాలు శిఖరాలు చేరుకోవడానికి. గొప్ప ప్రదర్శన చేశారంటే యావత్ ప్రపంచం జేజేలు పలుకుతుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇరగదీసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రశంసల జల్లులో తడిసి మురిసిపోతున్నాడు. ఓవల్ టెస్టుతో హీరో మహ్మద్ సిరాజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ అయ్యాడు. మాజీ పేసర్లు, దిగ్గజ ప్లేయర్లు ఎవరి నోట విన్నా సిరాజ్ చాలా గొప్ప బౌలర్ అనే మాటలే వినిపిస్తున్నాయి. వసీం అక్రమ్ కూడా భారత జట్టు అత్యుత్తమ బౌలర్ బుమ్రా కాదని.. మాయా భాయ్‌కే ఓటేశాడు.
Siraj’s Best Figures with Bumrah:
🔹 6/15 vs SA, Cape Town 2024
🔹 4/32 vs ENG, Lord’s 2021
🔹 4/66 vs ENG, Birmingham 2022Siraj’s Best Figures without Bumrah:
🔹 6/70 vs ENG, Birmingham 2025
🔹 5/60 vs WI, Port of Spain 2023
🔹 5/73 vs AUS, Brisbane 2021📷 ECB via Getty… pic.twitter.com/tURQ9myufU
— CricketGully (@thecricketgully) August 2, 2025
‘నేను క్రికెట్ మ్యాచ్‌లు అరుదుగా చూస్తాను. కానీ, ఓవల్ టెస్టులో ఐదోరోజు రెప్పవాల్చకుండా చూశా. సిరాజ్ ఆకలితో ఉన్న సింహంలా కనిపించాడు. జట్టును గెలిపించేందుకు అతడు గొప్ప ప్రదర్శన చేశాడు. ఐదు మ్యాచుల్లో 186 ఓవర్లు వేయడం మామూలు విషయం కాదు. వెయ్యికి పైగా బంతులు వేసినా.. ఓవ్లో ఐదో రోజు కూడా ఉత్సాహంగా బంతి అందుకున్నాడు సిరాజ్. ఇకపై అతడు సపోర్ట్ బౌలర్ కాదు. ముందుండి పేస్ దళాన్ని నడిపించే నాయకుడు.
నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేసినా సరే మియా భాయ్ నమ్మకాన్ని కోల్పోలేదు. ఒక యోధుడి లక్షణమది. నాకు ఓవల్ టెస్టు చూశాక టెస్టు క్రికెట్‌కు ఇప్పట్లో ఢోకా లేదనిపించింది’ అని పాక్ లెజెండ్ వెల్లడించాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన సిరాజ్ 23 వికెట్లతో సత్తా చాటాడు. ఓవల్ టెస్టులో అసాధారణ ప్రదర్శనతో జట్టు సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపై జరుగోయే టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడకున్నా సిరాజ్ ఉన్నాడనే నమ్మకాన్ని కెప్టెన్ గిల్, హెడ్‌కోచ్ గంభీర్‌లకు కలిగించాడీ పేస్ గన్.
Yeh #NayaIndia hain, ye haar kar, phir jeetna jaanta hai 💙
Mohammed Siraj lands the winning blow to script a historic victory at The Oval 🔥#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/rmoemQV7e0
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025