Washington Sunder : స్వదేశంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. మరో 24 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) సర్జరీతో ప్రపంచకప్ బరిలో ఉండడంపై సందేహాలు నెలకొనగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sunder) అనూహ్యంగా సన్నాహక సిరీస్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గాయపడిన సుందర్ .. తదుపరి టీ20 సిరీస్కుఅందుబాటులో ఉండడం లేదు.
వడోదరో జరిగిన తొలి వన్డేలో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ పక్కటెముకల నొప్పితో మైదానం వీడాడు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. దాంతో.. బ్యాటింగ్ చేయడం కూడా కష్టమే అనుకున్నారంతా. కానీ, జట్టు కోసం కుంటుతూనే సుందర్ క్రీజులోకి వచ్చి కేఎల్ రాహుల్‌తో కలిసి చివరి దాకా నిలబడ్డాడు. కానీ, అతడు కోలుకునేందుకు సమయం పట్టనున్నందున హేమంగ్ బదొనికి చివరి రెండు వన్డేల కోసం తీసుకున్నారు. టీ20 సిరీస్ లోపైనా ఈ తమిళ తంబీ ఫిట్‌గా అవుతాడని ఆశించిన భారత బృందానికి పెద్ద షాక్ తగిలింది.
🚨 Washington Sundar ruled out from the New Zealand T20i Series and he is also doubtful for the T20 World Cup
He is suffering from a rib injury. Ayush Badoni is his replacement in ODIs.
Hope Gambhir will not pick Ayush as his replacement in T20i team 🤦 pic.twitter.com/McMcPdomgT
— Tejash (@Tejashyyyyy) January 14, 2026
టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న సుందర్ గాయం టీమిండియాను కలవరపరుస్తోంది. 16మ్యాచుల్లో 6.16 ఎకానమీతో 23 వికెట్లు తీశాడీ ఆల్‌రౌండర్. బ్యాట్‌తోనూ అదరగొడుతూ 147పరుగులు సాధించాడు. అందుకని అతడు త్వరగా కోలుకోవాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అయితే.. జనవరి 31వ తేదీ వరకే స్క్వాడ్‌లో మార్పులు చేసుకునే వీలుంది. కాబట్టి ఆలోపు సుందర్ కోలుకుంటే సరి. లేదంటే అతడి బదులు మరొకరిని స్క్వాడ్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.