లక్నో : యూపీలో మహిళలు, యువతులపై లైంగిక దాడులు, వేధింపుల పరంపర కొనసాగుతోంది. ముజఫర్నగర్ జిల్లా రామ్రాజ్ పోలీస్స్టేషన్ పరిధిలో దళిత వర్గానికి చెందిన దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు ఫర్మాన్ శుక్రవారం మహిళ(25)ను సమీపంలోని చెరుకుతోటలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు బాధితురాలిని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్ట్ చేశామని స్ధానిక పోలీస్ అధికారి షకీల్ అహ్మద్ తెలిపారు.